Thursday, April 18, 2024

ఘనంగా ఎమ్మెల్యే గండ్ర జన్మదిన వేడుకలు

భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ లో గురువారం భూపాలపల్లి శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణా రెడ్డి 57వ పుట్టినరోజు వేడుకలు టిఆర్ఎస్ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి, స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా టూ వీలర్స్ అసోసియేషన్స్ వారి ఆధ్వర్యంలో ఉచిత సర్వీస్ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా జాగృతి జిల్లా అధ్యక్షులు మాడ హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో రిక్షా వాలాలకు కూరగాయలు పంపిణీ చేశారు. అదేవిధంగా ఫక్కీర్ గడ్డలోని బాలాంజనేయ స్వామి దేవాలయంలో పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వెంకట రాణి సిద్ధూ, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, ఎంపీపీ మందల లావణ్య విద్యాసాగర్ రెడ్డి, జెడ్పీ వైస్ చైర్ పర్సన్ కల్లెపు శోభ రఘుపతిరావు, టౌన్, మండల రూరల్ ప్రెసిడెంట్ లు, కటకం జనార్ధన్, పిన్ రెడ్డి రాజా రెడ్డి, ఎసిఎస్ చైర్మన్ మేకల సంపత్ కుమార్, నాయకులు బుర్ర రమేష్ గౌడ్, సాంబమూర్తి, అర్బన్ యూత్ నాయకులు బుర్ర రాజు, జాగృతి నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement