Monday, March 27, 2023

సీఎం కేసీఆర్‌పై అస‌త్య ప్ర‌చారాలు మానుకోవాలి : ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

వరంగల్ తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై అస‌త్య ప్ర‌చారాలు మానుకోవాల‌ని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ఇటీవల నర్సంపేటలో జరిగిన పాదయాత్ర ఘటనపై నేడు వైఎస్ షర్మిల తెలంగాణ గవర్నర్ తమిళసైతో భేటీ అయిన సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది పాత్రికేయులతో మాట్లాడారు. రెండు రోజుల క్రితం నర్సంపేటలో జరిగిన ఘటనలో వైఎస్ షర్మిలకి గాయం అయిందని టీవీలో చూపారు, తీరా నిన్న టీవీలో చూస్తే ఆ గాయం మాయమై పోయింద‌న్నారు. వారు ఏ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారో తెలంగాణ పజలకు తెలియచేయాల‌న్నారు. ఈ రోజు వైఎస్ షర్మిల తెలంగాణ గవర్నర్ ని కలవడం జరిగింద‌ని, నేను గవర్నర్ కి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా అని గాయం ఎంమైందో ఒక్కసారి షర్మిలనే అడగండి అన్నారు. తెలంగాణని ఒక ఆఫ్గనిస్తాన్ తో వారు పోల్చార‌ని.. అంటే ఒక గవర్నర్ గా మీరు తెలంగాణకి ఉన్నారా? లేక ఆఫ్గనిస్తాన్ కా? అని ప్ర‌శ్నించారు. ఈ మాటపై మీరు తెలంగాణ గవర్నర్ గా కచ్చితంగా స్పందించాల‌న్నారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రిని ఒక తాలిబాన్ గా పోల్చడాన్ని ఒక రాష్ట్ర గవర్నర్ గా మీరు సమర్థిస్తారా? అని ప్ర‌శ్నించారు. ఇప్పటికైనా ఇలాంటి అసత్య ప్రచారాలు మానుకోవాలని షర్మిలని కోర‌మైంద‌న్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement