Tuesday, May 30, 2023

బాబ్లీ మీద పోరాటం చేసినా నీళ్లు రాలే.. కేసీఆర్ తోనే నీళ్లు : మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

నర్సింహులపేట : బాబ్లీ మీద ఎన్నో పోరాటాలు చేసాం.. కానీ తెలంగాణకు సుక్క నీళ్లు రాలేదు కానీ కేసీఆర్ తోనే కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణకు నీళ్లు వచ్చాయని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో ఆయన మహబూబాబాద్ జిల్లా పార్లమెంటు సభ్యురాలు ఎంపీ మాలోత్ కవిత, డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ తో కలిసి మాట్లాడారు. ఈ నెల 18న ఖమ్మంలో జరగనున్న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభకు జన సమీకరణ పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన కోరారు. డోర్నకల్ నియోజకవర్గ బహిరంగ సభ ఇన్‌చార్జిగా ఆయన కార్యకర్తలకు పలు సూచనలు సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా గ్రంధాలయ ఛైర్మన్, ప్రస్తుత నర్సింహులపేట మండల బహిరంగ సభ ఇంఛార్జి ఎడవెల్లి కృష్ణా రెడ్డి, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement