Thursday, April 25, 2024

దీక్ష చేసి ప్రియుడిని భ‌ర్త‌గా చేసుకున్న శ్రీవాణి..

ములుగు – ప్రియుడితో పెళ్లి చేయాలని ఓ యువతి చేసిన పోరాటం ఎట్టకేలకు ఫలించింది. ములుగు మండలంలోని బండారుపల్లి గ్రామానికి చెందిన పెట్టెం సంతోష్ ప్రేమించి పెళ్లికి నిరాకరించాడు.. దీంతో ఈనెల 20న ప్రియుడి ఇంటి ముందు వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూర్ మండల కేంద్రానికి చెందిన నత్తి శ్రీ వేణి మౌనదీక్ష దిగింది. బాధితురాలి కథనం ప్ర‌కారం హన్మకొండ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్న ఈ క్రమంలో సంతోష్ తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. దీంతో రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన సంతోష్ శారీరకంగా దగ్గర అయ్యాడు..తీరా పెళ్లి విషయం తెచ్చేసరికి ముఖం చాటేశాడు. దీంతో యువతి ప్రియుడు సంతోష్ స్వగ్రామమైన బండారుపల్లి గ్రామంలోని వారి ఇంటి వద్ద మార్చి 20న మౌన దీక్షకు దిగింది. దీనికి ప్రజా సంఘాలు ఎమ్మార్పీఎస్ నాయకులు కుల పెద్దలు సహకారంతో ఎట్టకేలకు పోలీస్ కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో సంతోష్ వివాహనికి అంగీక‌రించాడు.. ఇరువర్గాల కుల సంఘాల ఆధ్వర్యంలో ములుగు శివాలయం లో ఇద్దరికి ఎట్టకేలకు వివాహం చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు జన్ను రవి మాదిగ, చుంచు రవి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అండ్ మానిటరింగ్ కమిటీ జిల్లా కమిటీ సభ్యులు ఎమ్మార్పీఎస్ టీ యస్ జిల్లా అధ్యక్షులు బోడ రాములు
ఎమ్మార్పీఎస్ టీ యస్ మండల అధ్యక్షుడు చుంచు రవి, నాదెళ్ల సాంబయ్య,ఉట్ల మోహన్ కూరి దినకర్. దొడ్డ రామచందర్, ఎమ్మార్పీఎస్ వరంగల్ జిల్లా రూరల్ మహిళా అధ్యక్షురాలు మిట్టపల్లి రాధిక, జనచైతన్య రాష్ట్ర అధ్యక్షురాలు పాసికంటి శ్రీలత, డి, దయాకర్ తెలంగాణ యూత్ అధ్యక్షులు, ఆత్మకూరు ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు నాగేల్లి రాజు, ఎమ్మార్పీఎస్ టీ యస్ జిల్లా కన్వీనర్ బోడ రాములు మండల ఎమ్మార్పీఎస్ టీ యస్ అధ్యక్షులు రవి, నత్తి నరేష్. తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement