Wednesday, April 24, 2024

పాలాభిషేకాలు చేయొద్దు.. నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాను : వ‌రంగ‌ల్‌ సీపీ రంగనాథ్

నా ఉద్యోగ నిర్వహణలో భాగంగానే భూ తగాదాలను పరిష్కరించి ప్రజలకు న్యాయం చేస్తున్నాను. భూ బాధితులు ఎవరు తన చిత్రాలతో కూడిన ప్లెక్సీలను ఏర్పాటు చేసి వాటికి పాలభిషేకాలు చేయవద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగ‌నాథ్‌ భూ బాధితులకు సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పలు భూ కబ్జాలకు సంబంధించిన కేసులను పరిష్కరించి బాధితులకు తగు రీతిలో న్యాయం చేస్తుండంతో పాటు భూ కబ్జారాయుళ్ల‌ భరతం పడుతూ వరంగల్ పోలీస్ కమిషనర్ ద్వారా న్యాయం పొందిన బాధితులు పోలీస్ కమిషనర్ రంగనాథ్ పై తమ అభిమానం చాటడంతో పాటు కృతజ్ఞత భావంతో బాధితులు పోలీస్ కమిషనర్ చిత్రాలు కూడిన ప్లెక్సీలను కూడళ్ళల్లో ఏర్పాటు చేసి పాలభిషేకాలు జరపడంపై వరంగల్ పోలీస్ కమిషనర్ స్పందిస్తూ ఆదివారం పత్రికా ప్రకటన విడుదల చేసారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన మేరకు పేదవారికి తగురీతిలో న్యాయం చేయడంతో పాటు వారికి వెన్నంటి ఉంటూ నా ఉద్యోగ బాధ్యతను నిర్వర్తిస్తూ పేదలకు న్యాయం చేసే దిశగా నాకర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాను అని వ‌రంగ‌ల్ పోలీస్ క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ అన్నారు అన్నారు. ఇదే రీతిలో వరంగల్ కమిషనరేట్ కు చెందిన ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది సైతం తమకు అప్పగించిన బాధ్యతలను బాధ్యతయుతంగా నిర్వహిస్తూ నిరుపేదలకు న్యాయం అందిస్తున్నార‌ని పేర్కొన్నారు. తద్వారా కమిషనరేట్ పరిధిలో పలు భూకబ్జా కేసులను పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తుండంతో తిరిగి తమ భూములను పొందిన బాధితులు తనకు కృతజ్ఞతలు తెలుపుకునే రీతిలో తన ప్లెక్సీలకు పాలభిషేకాలు చేయడం సరికాదన్నారు. నిరంతరం శాంతి భద్రతలను పర్య‌వేక్షించడంతో పాటు నిరుపేద వర్గాల ప్రజలకు న్యాయం అందించాల్సిన బాధ్యత తనపై ఉందని ఇందులో భాగంగానే భూ కబ్జా కేసులకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులపై క్షేత్ర స్థాయిలో లోతుగా విచారణ జరిపి రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులు, ఇతర ప్రభుత్వ విభాగాలతో పాటు సహచర పోలీస్ అధికారులు, సిబ్బంది సహకారంతో చట్ట పరిధిలో బాధితులకు న్యాయం అందించడం జరుగుతోంద‌న్నారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు నిరంతరం బాధితుల పక్షాన నిలుస్తారని. బాధితులకు న్యాయం చేయడం పోలీసుల కర్తవ్యంలో ఒక భాగమేనని, కావున పోలీసులపై అభిమానాన్ని చాటేందుకుగాను పాలభిషేకాలు చేయాల్సి అవసరం లేదని పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement