Thursday, May 19, 2022

రాజన్నను దర్శించుకున్న డీజీపీ

వేములవాడ, (ప్రభన్యూస్‌): సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి వారిని తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి, పోలీస్‌ హౌసింగ్‌ బోర్డు చైర్మన్‌ కోలేటి దామోదర్‌లు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో కోడె మొక్కు చెల్లించుకున్న అనంతరం స్వామి వారికి వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ అధికారులు, అర్చ కులు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం డీజీపీకి స్వామి వారి చిత్రపటం, ప్రసాదం అందించి అధికారులు సన్మానించగా, అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. ఈకార్యక్రమంలో ఆలయ ఏఈఓ బ్రహ్మన్నగారి శ్రీనివాస్‌, ప్రోటోకాల్‌ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు, నులిగొండ రాజేందర్‌, జిల్లా ఎస్పీ రాహుల్‌

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement