Thursday, March 28, 2024

విద్య ద్వారానే మహిళల వికాసం : మంత్రి ఎర్రబెల్లి

విద్య ద్వారానే మహిళల వికాసం జరుగుతుందని నమ్మి సావిత్రిబాయి ఫూలే తొలి ఉపాధ్యాయురాలుగా విద్యను బోధించారని, మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించి, దళిత, బహుజన స్త్రీ జనోద్దరణ కోసం తన జీవితాంతం కృషి చేసిన మహనీయురాలు సావిత్రిబాయి అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా ఆమెకు నివాళి అర్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల వికాసం, సాధికారత కోసం బాలికల విద్య, సంక్షేమం, భద్రత, అభివృద్ధికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం కేజీబీవీలను పక్కన పెట్టగా కేసీఆర్ ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ కేజీబీవీలను గతంలో కంటే గొప్పగా కొనసాగిస్తోందన్నారని కొనియాడారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మహిళలకు తొలిసారిగా డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీలు పెట్టిన ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement