Saturday, June 3, 2023

బైకును ఢీకొన్న డీసీఎం ‍.. స్పాట్ లో ముగ్గురు మృతి

బైకును డీసీఎం ఢీకొనడంతో స్పాట్ లోనే ముగ్గురు చనిపోయిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. భువనగిరి మండలం హన్మాపురం వద్ద వేగంగా దూసుకొచ్చిన డీసీఎం అదుపుతప్పి బైకును ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, పురుషుడు ఉన్నారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement