Wednesday, April 24, 2024

దళిత బంధు లబ్ధిదారులు ఆర్థికంగా ఎదగాలి : ఎమ్మెల్యే అరూరి ర‌మేష్‌

వరంగల్ : దశబ్దాలుగా సామాజిక వివక్షకు, అణచివేత గురైన దళితులను ఆర్థిక సాధికారత, స్వావలంబన సాధించి సమాజంలో ఉన్నతంగా జీవించాలానే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టారని తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. దళిత బంధు పథకం ద్వారా స్వయం ఉపాధి కోసం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ 3 డివిజన్ లో కొత్తపేట గ్రామానికి చెందిన ఈ సంపెల్లి సంజీవ వరంగల్ బస్టాండ్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఆటో స్పెర్ పార్ట్స్ షాప్ ను ఎమ్మెల్యే అరూరి రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దళిత బంధు పథకంతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకొని ఆర్థికంగా స్థిరపడాలని లబ్ధిదారులకు సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దళితుల సంక్షేమానికి ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రవేశ పెట్టినట్లు తెలిపారు. దళితుల పక్షపాతి సీఎం కేసీఆర్ ని, దళితులు టీఆర్ఎస్ పార్టీకి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్, డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement