Tuesday, March 26, 2024

జలపాతంలో జన సందడి.. బొగత జలపాతానికి పర్యాటకుల తాకిడి

వాజేడు : తెలంగాణ మినీ నయాగార జలపాతంగా పిలువబడే ములుగు జిల్లాలోని వాజేడు మండల పరిధిలోగల చీకుపల్లి బోగత జలపాతంలో జన సందడి సంతరించుకుంది. ఆదివారం సెలవుదినం కావడంతో తెలంగాణ రాష్ట్ర నలుమూల వివిధ జిల్లాల నుండే కాక ఆంధ్రప్ర‌దేశ్‌, ఛ‌త్తీస్ గ‌ఢ్ రాష్ట్రాల నుండి పర్యాటకులు అత్యధికంగా తరలివచ్చారు. బొగత జలపాతం అందాలను వీక్షిస్తూ ఆహ్లాదాన్ని పొందారు. అందాలను కనువిందు చేసే బోగత జలపాతం ప్రాంగణంలో కుటుంబ సమేతంగా పిల్లాపాపలతో కలిసి రోజత్తమానం జలపాతంలో గడిపి ఆనంద కెరటాలలో మునిగితేలారు. రాష్ట్ర నలుమూలల నుండి పర్యాటకులు అత్యధికంగా హాజరుకావడంతో బోగత జలపాత ప్రాంగణం పర్యాటకులతో కిక్కిరిసిపోయింది. పచ్చని అడవి తల్లి ఒడిలో పక్షుల కేరింతల నడుమ బొగత అందాలను తిలకిస్తూ జలపాత లోయలో జలకాలాడుతూ సండే దినమున పర్యాటకులు సందడి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement