Sunday, March 24, 2024

కార్పోరేట్ కు దీటుగా సర్కారు బడులు : ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ‌ తీసుకుంటుందని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మన బస్తి – మన బడి కార్యక్రమంలో భాగంగా దేశాయిపేటలోని ప్రభుత్వ పాఠశాలలో రూ.27,15,887 చేపడుతున్న పనులకు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ముఖ్య అతిధిగా హాజరై శంకుస్థాపన చేసారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం,ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల పిల్లలకు నాణ్యమైన విద్య అందాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పోరేట్ పాఠశాలలకు దీటుగా వసతుల కల్పన, కార్పోరేట్ కు దీటైన విద్యాబోధ‌నకి అన్నిరకాల నిధులు కేటాయించారన్నారు. సర్కారు బడుల్లో సన్నబియ్యంతో భోజనం పెడుతూ విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం బోధ‌న చేపడుతున్నారన్నారు. గతంలో సర్కారు బడి అంటే ప్రజల్లో చిన్న చూపు ఉండేదని, తెలంగాణా ఏర్పాటు తర్వాత సర్కారు బడులకు మహర్థశను ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువచ్చారన్నారు. ప్రభుత్వ బడులపై ప్రజలకు నమ్మకం పెరిగిందన్నారు. మన బస్తి మన బడి తో మన బడులను బాగుచేసుకునే రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను అద్బుతంగా అభివృద్ది చేస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో బోదన నాణ్యమైన విద్య అందుతుందని, కార్పోరేట్ స్థాయిలో వసతుల కల్పన, విద్యాబోదనతో పేదలకు సర్కారు పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్, స్థానిక కార్పోరేటర్ కావటి కవిత రాజు యాదవ్,పలువురు కార్పోరేటర్లు, విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement