Sunday, April 14, 2024

దెబ్బతిన్న పంటలకు ఎకరాకు రూ.70 వేల చొప్పున పరిహారం అందించాలి

నడికుడి : రాష్ట్రంలో రెండు రోజులుగా కురుస్తున్న అకాల వడగండ్ల వర్షాలకు అధిక మొత్తంలో మొక్కజొన్న, మిరప, కూరగాయ పంటలు దెబ్బతినటంతో మరోసారి రైతు నెత్తిన పిడుగు పడినట్లైంది. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ లో పత్తి, వరి తదితర పంటలు వేయగా భారీ వర్షాలకు దిగుబడి రాక, పెట్టిన పెట్టుబడి రాక నాశన‌మైపోగా కనీసం ఇప్పుడు రబీ సీజన్ లో నైనా దిగుబడి రావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సూచించిన ప్రకారం వరి పంట వేయకుండా ప్రత్యామ్నాయ పంటలైన మొక్కజొన్న, మిరప, కూరగాయ పంటలు సాగు చేస్తుంటే మూలిగే నక్కమీద తాటికాయ‌ పడ్డట్టు అకాల వర్షాలతో పంటలు పూర్తిగా నేలకొరిగాయి.
ప్రభుత్వం కేవలం ఎకరాకు రూ.5000లు రైతుబందు పేరుతో ఇచ్చి సంబరాలు చేసుకోకుండా, క్షేత్ర స్థాయిలో పంటలను పరిశీలించి దెబ్బతిన్న పంటలకు ఎకరాకు రూ. 70 వేల చొప్పున రైతన్నలకు నష్టపరిహారం అందించాలని కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో రైతుల పక్షాన పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత‌లు తెలిపారు. అలాగే పార్టీ శ్రేణులు మీమీ గ్రామాల్లో రైతుల పక్షాన పోరాటం చేసి వారికి బాసటగా నిలవాలని కోరుకుంటున్నామ‌న్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement