Friday, February 3, 2023

జాతీయ రహదారిపై బొగ్గు పొడి లారీ దగ్ధం..

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జాతీయ ర‌హ‌దారిపై బొగ్గుపొడి లారీ దగ్ధమైన ఘ‌ట‌న చోటుచేసుకుంది. జిల్లాలోని మహాదేవపూర్ కాటారం జాతీయ రహదారిపై రాయచూర్ బల్లపూర్ నుంచి బొగ్గు పొడితో ఒరిస్సా చంబల్ పూర్‌కు వెళ్తున్న లారీలో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. సెక‌న్ల వ్య‌వ‌ధిలోనే లారీ మొత్తం మంట‌లు వ్యాపించాయి. దీంతో లారీ అగ్నికి ఆహుతయ్యింది. దీంతో లారీ నుంచి భారీగా మంట‌లు చెల‌రేగాయి. రహదారిపై దట్టమైన పొగతో మంటలు పెద్దఎత్తున ఎగిసిపడ్డాయి. వెంట‌నే స్థానికులు అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంట‌ల‌ను అదుపు చేశారు. ప్ర‌మాదానికి షార్ట్ సర్క్యూట్ కార‌ణ‌మ‌ని ప‌లువురు భావిస్తున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement