Thursday, March 28, 2024

Flash Flash: గణపురంలో చైన్ స్నాచింగ్ కలకలం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం కేంద్రంలోని గుడివాడలో శనివారం సాయంత్రం చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. స్థానికుల వివరాలు ప్రకారం.. గుర్తు తెలియని వ్యక్తి గుడివాడలో ఓ ఇంటి ముందు ఆడుకుంటున్న పిల్లలను మీ నాన్న ఉన్నాడా అని అడిగాడు. ఆ పిల్లలు మా అమ్మ ఉందంటూ చెప్పడంతో మీ అమ్మను పిలువు అనడంతో ఇంట్లో నుండి ఆ మహిళ బయటికి వచ్చింది. ఆమె బయటకు రాగానే మెడలోని సుమారు మూడు తులాల మంగళసూత్రాన్ని లాక్కోని పారిపోయాడు. దీంతో ఆందోళనకు గురైన బాధితురాలు కేకలు పెట్టగా… చుట్టుపక్కల వారు వచ్చారు. ఈలోపు చైన్ స్నాచర్ బైక్ పై పరాయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement