Friday, April 19, 2024

చై..నా విద్యాసంస్థల పీఆర్వోలను తరిమికొట్టండి : ఏఐఎస్ఎఫ్ అధ్యక్షుడు శరత్

కార్పొరేట్ విద్యా సంస్థలైన శ్రీ చైతన్య, నారాయణ విద్యా సంస్థల వారిని తెలంగాణ నుండి నిషేధించాలని, తెలంగాణ‌ రాష్ట్రం ఏర్పడితే చై..నా విద్యా సంస్థలను తరిమికొడుతాం అన్న కేసీఆర్ నేడు వారికి రెడ్ కార్పెట్ పరుస్తూ వత్తాసు పలుకుతూన్నారని ఏఐఎస్ఎఫ్ అధ్యక్షుడు ల్యాదాల్ల శరత్ అన్నారు. చై..నా విద్యా సంస్థలే ప్రధానంగా విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమవుతున్నాయన్నారు. అడ్మిషన్ల కోసం ఇంటింటి వచ్చే పిఆర్వోలను తరిమికొట్టాలని శరత్ అన్నారు. వరంగల్ లోని రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ల్యాదాల్ల శరత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులను వేధిస్తూ విద్యార్థులను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తూ విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమవుతున్న చై..నా విద్యా సంస్థలను నిషేధించాలని, ఆ విద్యాసంస్థల్లో ప్రతి సంవత్సరం పదుల సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. అయినా శ్రీ చైతన్య, నారాయణ కళాశాలలపై కఠిన చర్యలు లేవని అన్నారు. ఇప్పటికీ వరకు వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న బ్రాంచిలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అనుమతి లేకున్నా.. ఒక చోట అనుమతి ఇంకో చోట తరగతులు నిర్వహిస్తున్నార‌న్నారు. అధికారులు పట్టించుకోకుండా, తనిఖీలు చేయకుండా వారికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్నారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని శరత్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు రాకేష్, సురేందర్, చందన్, ప్రశాంత్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement