Monday, January 30, 2023

Breaking: ఉరివేసుకొని యువకుడు మృతి

మల్హర్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని తాడిచెర్ల గ్రామానికి చెందిన జనగామ రవి(30) గ్రామ శివారులో ఉన్న చెట్టుకు ఉరివేసుకొని గురువారం మృతి గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం తెలుపగా హుటాహుటిన సంఘటన స్థలానికి కొయ్యూరు పోలీసులు వెళ్లి ఉరివేసుకున్న ప్రాంతాన్ని పరిశీలించారు అనంతరం మూర్తిదేహాన్ని పోస్టుమార్టంకు పంపినట్లు పోలీసులు తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతునికి భార్య, పిల్లలు ఉన్నారు. కాగా రవి ఆత్మ హత్యకు గల కారణాలు తెలియ రాలేదు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement