Wednesday, April 24, 2024

‘హద్దు’లు దాటుతున్న నల్లబెల్లం… ఆంధ్ర‌ నుంచి తెలంగాణకు అక్రమ రవాణా..!

మహబూబాబాద్, (ప్రభన్యూస్) : తెలంగాణ రాష్ట్రంలో నిషేధించిన నల్లబెల్లం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అక్రమ రవాణా అవుతుంది. స్థానికంగా ఎంత నియంత్రణ విధించినా పక్క రాష్ట్రం నుంచి హద్దులు దాటి వస్తున్న అక్రమ సరుకును అధికారులు అడ్డుకోలేకపోతున్నారు. ఎంతో దర్జాగా ప్రయాణికుల మాదిరిగా టిప్ టాప్ గా ముస్తాబై విద్యార్ధులు, గృహిణులుగా నటిస్తూ నల్లబెల్లాన్ని రవాణా చేస్తున్నారు. ఏపీలో బెల్లం తయారీ కేంద్రాలు అధికంగా ఉండటం, అక్కడ నల్లబెల్లం విక్రయాలపై నిఘా లేకపోవడంతో తెలంగాణ నుంచి కొనుగోళ్లు అధికమవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement