Thursday, April 25, 2024

అటవీ గ్రామాలను వణికిస్తున్న పెద్దపులి.. పలిమేల గుత్తి కోయగూడెంలో ఎద్దుపై దాడి

పలిమేల : జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు పెద్దపులి మళ్ళీ వచ్చింది. దీంతో ఎప్పుడు ఎక్కడ ఎవరి పై దాడి చేస్తుందో అని భయాందోనలో అటవీ గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. తాజాగా ఆదివారం రాత్రి పలిమేల మండలంలోని సింగంపల్లి నుండి కామన్ పల్లి, ముకునూరు, తిమ్మేటి గూడెం అడవుల్లో పులి సంచారం చేసినట్లు వాటి పాదముద్రలను గుర్తించినట్టు పలిమెల రేంజర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం రాత్రి ముఖ్నూరు గ్రామం పంచాయతీ పరిధిలోని తిమ్మెటిగూడెం గ్రామ సమీపంలోని పంట పొలాల పక్కనే ఉన్న అడవిలో ఎద్దును చంపి తిన్నదని గ్రామస్థుల ద్వారా సమాచారం అందటంతో వెళ్లి తమ బృందాలకు పరిశీలించినట్లు తెలిపారు. కాగా సోమవారం పులి పాదముద్రలు ఏటూరునాగారం అభయారణ్యం వైపు వెళ్ళినట్లు గుర్తించినట్లు తెలిపారు.

పశువు పై దాడి చేసిందని దాని ఆహారం పూర్తిగా తినకపోవడంతో మళ్ళీ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. పులి సంచరిస్తున్నందున పశువుల కాపరులు, ప్రజలు కానీ అడవుల్లోకి వెళ్లవద్దని ఫారెస్ట్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పంటచేలలో ఎవరైనా ఉచ్చులు, విద్యుత్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తే వాటిని వెంటనే తొలగించాలని పులికి ఎలాంటి హాని జరిగినా కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. కాగా గ్రామాల్లో మళ్లీ పులి సంచరించడం తో గ్రామస్తులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement