Friday, April 19, 2024

కమలాపూర్‌ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం..

భూపాలపల్లి రూరల్‌, ప్రభన్యూస్ : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పరిధిలోని కమలాపూర్‌ గ్రామ శివారు అటవీ ప్రాంతంలో బుధవారం పెద్దపులి సంచరిస్తున్నట్లు ఆనవాళ్ళు లభించాయి. కమలాపూర్‌ శివారు అటవీ ప్రాంతంలో తునికాకు సేకరణకు వెళ్ళిన కూలీలకు పులి సంచరించిన గుర్తులు కనిపించాయి. కమలాపూర్‌ గ్రామ శివారులోని ఫారెస్ట్‌లో పెద్దపులి సంచరించడంతో గ్రామస్తులు, తునికాకు కూలీలు భయాందోళన చెందుతున్నారు. కమలాపూర్‌ అటవీ ప్రాంతం నుండి ఆజంనగర్‌ అటవీ ప్రాంతం వైపు పెద్ద పులి వెళ్లినట్లు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు.

అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా పెద్దపులి సంచరించిన అడుగులు గుర్తించినట్లు భూపాలపల్లి ఫారెస్ట్‌ డివిజనల్‌ అధికారి కృష్ణ ప్రసాద్‌ తెలిపారు. పులి సంచరిస్తున్న నేపథ్యంలో తునికాకు కూలీలు అటవీ ప్రాంతానికి వెళ్ళకూడదని జాగ్రత్తగా ఉండాలని ఎఫ్‌ డి ఓ కృష్ణ ప్రసాద్‌ కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement