Monday, November 11, 2024

WGL: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి… కలెక్టర్ రాహుల్ శర్మ

చిట్యాల, సెప్టెంబర్ 5 (ప్రభ న్యూస్): జయశంకర్ జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని సామాజిక వైద్యశాలలో వైద్యులు, సిబ్బంది ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, సీజనల్ వ్యాధుల సమయంలో సమయపాలన, ప్రజలకు అందుబాటులో సేవలు అందించాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కోరారు. గురువారం మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. రోగుల వివరాలు ఆన్ లైన్‌లో నమోదును కలెక్టర్ పరిశీలించారు. గ్రామాల్లో జ్వరాల బారిన పడకుండా ముందస్తు ట్యాగ్ చేసి ఇంటింటి జ్వర సర్వే చేపట్టాలని కోరారు.

విధుల నిర్వహణలో భాగంగా వైద్యుల షెడ్యూల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ వైద్యాధికారులను ఆదేశించారు. మూడు షిఫ్టుల్లో వైద్యులు అందుబాటులో ఉండే విధంగా షెడ్యూల్ తయారు చేయాలని ఆదేశించారు. ఆగస్టు నెల‌లో 3,578 మందికి ఓపి, 655 మందికి ఇన్ పేషెంట్స్ కు వైద్య సేవలు అందించారని, 122 ఏఎన్సీ, 12 ప్రసవాలు, 8 ట్యూబెక్టమి శస్త్ర చికిత్సలు చేసినట్లు తెలిపారు. ప్రసవాలు పెంచాలని, ఇందుకొరకు అశల ద్వారా గర్భిణీ మహిళల జాభితా సేకరించి నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు.

ఆసుపత్రి పరిసరాలు, నిర్వహణ అన్ని వేళల్లో పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. పాము, కుక్క కాటు మందులు అందుబాటులో ఉంచాలని తెలిపారు. క్రిమిసంహారక మందులు సేవించి బలవన్మరణానికి పాల్పడుతున్న కేసుల గురించి కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, మండల ప్రత్యేక అధికారి విజయలక్ష్మి, ఇన్చార్జి ఎంపీడీవో రామకృష్ణ ఆర్ఐ రాజు, గ్రామ కార్యదర్శి రవికుమార్, వైద్యులు డా.శ్రీకాంత్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement