Monday, June 5, 2023

వెలిచాలా పంచాయతీకి అవార్డు

దీన్ దయాల్ ఉపాధ్యాయ జాతీయ పంచాయతీ అవార్డులో భాగంగా జిల్లాస్థాయి ఉత్తమ అవార్డుకు రామడుగు మండలం వెలిచాలా గ్రామ పంచాయతీ ఎంపికైంది. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో మంత్రి గంగుల కమలాకర్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో పురస్కారాన్ని వెలిచాలా గ్రామ సర్పంచ్ వీర్ల సరోజన ప్రభాకర్ రావు అందుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఈ అవార్డు రావ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని, మ‌రింత బాధ్య‌త‌గా ప‌నిచేసి గ్రామాన్ని ఆద‌ర్శంగా తీర్చిదిద్దుతామ‌న్నారు. మంత్రి, ఎమ్మెల్యేల స‌హ‌కారంతోనే గ్రామాన్ని అభివృద్ధి చేయ‌డం సాధ్య‌మైంద‌న్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement