Thursday, February 2, 2023

దారుణం.. మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం..

నిర్భయ, దిశ లాంటి ఎన్ని చట్టాలొచ్చినా మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. కామంతో కళ్లు మూసుకుపోయినా దుర్మార్గులు దారుణాలను ఒడిగడుతున్నారు. పసిపిల్లలు మొదలుకొని వృద్ధులను సైతం వదలడం లేదు. నిత్యం ఏదో ఒక మూలన అమ్మాయిలపై లైంగిక వేధింపులు జరుగుతూనేవున్నాయి. తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. మ‌హ‌బూబాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. గార్ల మండలం పరిధిలోని రాంపురం పంచాయతీ కొత్త తండాలో.. అదే గ్రామానికి చెందిన యువకుడు అభం శుభం తెలియని మూడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విష‌యం తెలిసిన గ్రామ‌స్తులు నిందితుడిని స్తంభానికి క‌ట్టేసి దేహ‌శుద్ధి చేశారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నారిని ఉయ్యాల‌లో ప‌డుకోబెట్టి తల్లిదండ్రులు వ్యవసాయ పనులు నిమిత్తం వెళ్లారు. పాప ఉయ్యాల‌లో నిద్రిస్తున్న సమయంలో అదే గ్రామానికి చెందిన అశోక్ (25) అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఇది గ‌మ‌నించిన స్థానికులు యువకుడ్ని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేస్తూ దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయమై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటన స్థలానికి గార్ల, బయ్యారం సీఐ బాలాజీ, ఎస్సై భానోత్ వెంకన్న కేసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement