Saturday, April 20, 2024

పల్లె ప్రగతితో గ్రామాల్లో అద్భుత ఫలితాలు.. ఎమ్మెల్యే అరూరి

రాఫ్ట్రంలోని ప్రతీ గ్రామంలో పారిశుద్యం, పచ్చదనంతో పాటు ఆరోగ్య తెలంగాణ నిర్మించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని, పల్లె ప్రగతితో గ్రామల్లో అద్భుత ఫలితాలు వస్తున్నాయని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్థన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ తెలిపారు. పర్వతగిరి మండలం వడ్లకొండ, కల్లెడ, ముంజాలకుంట తండా గ్రామాల్లో సుమారు రూ. 3కోట్ల 60లక్షలతో చేపట్టిన వైకుంఠ దమాలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డ్, రైతు వేదికలు, క్రీడా ప్రాంగణం, ఆరోగ్య కేంద్రం, మహిళా భవనం అంతర్గత సిసి రోడ్లు వంటి పనులను ఎమ్మెల్యే అరూరి రమేష్ ప్రారంభించారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే అరూరి రమేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని గ్రామాలను అభివ్రుద్ది చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. దీనిలో భాగంగా ప్రతీ నెలా గ్రామ పంచాయితీలకు నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమంతో ఇప్పటికే గ్రామాల్లో ఘననీయమైన అభివృద్ది పనులు జరుగుతున్నాయని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనన్నారు. ప్రజా సంక్షేమమే ద్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పని చేస్తున్నారని తెలిపారు. రైతు బందు, రైతు భీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్లు, కేసీఆర్ కిట్ వంటి అనేక ప్రజా సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం ప్రతీ ఇంటికి అందిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement