Thursday, June 1, 2023

కారును ఢీ కొన్న లారీ.. ఒకరి పరిస్థితి విషమం

ఏటూరునాగారం (ప్రభ న్యూస్ ) : ములుగు జిల్లా మండలంలోని రొయ్యూరు పెట్రోల్ బంక్ వద్ద కారును లారీ ఢీ కొట్టింది.ఈ ప్ర‌మాదంలో ఒకరి తీవ్ర‌గాయాలు కావ‌డంతో పరిస్థితి విషమంగా ఉంది. కాగా మ‌రో మహిళకు గాయాలయ్యాయి.ఈ ప్రమాదంలో గాయపడిన వారు వెంకటాపురంకు చెందిన పోలిన శ్రీనివాసరావు, అతని కుమార్తె అని సమాచారం. ఇదే సమయంలో వెంకటాపురం నుండి ములుగు వైపు వస్తున్న వెంకటాపురం జడ్పీటీసీ పాయం రమణ క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement