Saturday, April 20, 2024

వసంతోత్సవంతో ముగిసిన బ్రహ్మోత్సవాలు

మంగపేట : రెండవ యాదగిరిగుట్టగా ప్రసిద్ధి చెందిన ములుగు జిల్లా మంగపేట మండలం శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు శనివారం ముగిశాయి. మే 12న అంకురార్పణతో ప్రారంభమైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఈరోజు వసంతోత్సవంతో ముగిశాయి. ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రవణం సత్యనారాయణ పర్యవేక్షణలో బ్రహ్మోత్సవాల నిర్వాహక అర్చకులు అమరవాది మురళి కృష్ణమాచార్యులు, ఆలయ అర్చకులు కైంకర్యం రాఘవాచార్యులు, ముక్కామల రాజశేఖర్ శర్మ, కారంపూడి పవన్ కుమారాచార్యులు, ఈశ్వర్ చంద్ తదితర అర్చకులు ఆలయంలోని మూల విరాట్ తో పాటు స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు శనివారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో గజ వాహనంపై శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ఆలయం ప్రాంగణ పరిసరాల్లో ఉరేగిస్తూ వసంతోత్సవం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు కార్యక్రమం నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement