Tuesday, April 16, 2024

వరంగల్‌ ఓఆర్‌ఆర్‌ జీవోను ఉపసంహరించుకోవాలి.. సీఎం కేసీఆర్‌కు రేవంత్ లేఖ‌

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్ సొంతూరు అయిన‌ అక్కంపేట అభివృద్ధిపై రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యధోరణితో వ్యవహరిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ఆయన బహిరంగ లేఖ రాశారు.
”అక్కంపేటలో కనీస మౌలిక సదుపాయాలు లేవు. రెవెన్యూ గ్రామహోదా కూడా లేదు. అక్కంపేటపై అలక్ష్యం.. జయశంకర్‌పై అక్కసును చాటుతోంది. దళిత బంధు అంటూ గొప్పలు చెప్పుకోవడం తప్పితే దళితుల జీవితాల్లో ఎటువంటి మార్పు రాలేదు. అక్కంపేటలో ఓ కుటుంబాన్ని చూస్తే అర్థమైంది.

వరంగల్‌ ఓఆర్‌ఆర్‌ కోసం వరంగల్‌, హన్మకొండ, జనగామ జిల్లాల్లో కలిపి మొత్తం 27 గ్రామాల్లో 21,517 ఎకరాలను సేకరించేందుకు సిద్ధమయ్యారు. ఈ ఓఆర్‌ఆర్‌ మాత్రం పచ్చని పొలాల్లో చిచ్చుపెడుతోంది. దీనివల్ల లక్షమందికి పైగా రైతులు, కౌలుదారులు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. అభివృద్ధికి కాంగ్రెస్‌ ఎప్పుడూ వ్యతిరేకం కాదు. కానీ, అభివృద్ధి ముసుగులో రైతుల ఉసురు తీయొద్దు. భూసేకరణ ప్రకటన వచ్చినప్పటి నుంచి రైతులు దినదినగండంగా గడుపుతున్నారు. ఓఆర్‌ఆర్‌ జీవో ప్రకటనను వెంటనే ఉపసంహరించుకోవాలి. లేని పక్షంలో రైతుల తరుపున క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ ఉద్యమిస్తుంది.” అని ఆ లేఖలో రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement