Thursday, April 25, 2024

ఆంధ్రప్రభ ఎఫెక్ట్: రెండేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం

రెండేళ్ళ బాలుడిని కిడ్నాప్ చేసిన కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. ఈనెల 11న, కిడ్నాప్ జరుగగా, కిడ్నాప్ మిస్టరీ వీడటానికి 18 రోజులు పట్టింది. రెండు సంవత్సరాల బాలుడిని అపహరణకు పాల్పడ్డ ఆరుగురు సభ్యుల ముఠాను శుక్రవారం మట్వాడా పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన ముఠా సభ్యుల్లో ఇద్దరు మహిళలు కూడ ఉన్నారు. పోలీసులు అరెస్టు చేసిన ముఠా సభ్యుల వివరాలు ఇలా ఉన్నాయి. హైద్రబాద్ బేగంపేట లోని రసూల్ పూర్ కు చెందిన వంట మనిషి ముద్గంగుల జానకి అలియాస్ ఝాన్సీ(22) ,నర్సంపేట కుమ్మరికుంట ఎస్సీ కాలనీకి చెందిన గుంపి రాజు (25), బతుకు దేరువు కోసం హైదరాబాద్ బేగంపేట లోని రసూల్ పూరాలోకు మకాం మార్చి.. ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నాడు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ కు చెందిన గుంపి.మహేష్ ( 23) బేగంపెట్ పాటిగడ్డ కు చెందిన పల్లెపు కృష్ణ (27) ఆఫీస్ బాయ్, హైదరాబాద్ హయత్ నగర్ కు చెందిన కొనరెడ్డి ఎల్లమ్మ(50) రంగారెడ్డి జిల్లా కందుకూరి మండలం మీర్ ఖాన్ పెట్ కు చెందిన జంగయ్య(49)లు ఉన్నారు.

ఈ ముఠా అరెస్టుకు సంబంధించిన వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి వివరాలను పత్రికలకు విడుదల చేశారు. ఈ నెల పదకొండవ తేది తెల్లవారుజామున రెండు సంవత్సరాల తన కుమారుడు డానియల్ అపహరణకు గురైనట్లుగా బాలుడి తల్లి మట్వాడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఫిర్యాదుపై స్పందించిన మాట్వాడా పోలీసులు విచారణ జరిపి సిసి కెమెరాల ఫుటేజీ ఆధారంగా బాలుడుని అపహరణకు పాల్పడిన ఆరుగురు ముఠా సభ్యులను మాట్వాడా పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితులను పోలీసులు విచారించగా నిందితుల్లోని జానకి, రాజు గత కొద్ది సంవత్సరాలుగా హైదరాబాద్లో ఒకే ఇంటిలో సహజీవనం చేస్తున్నారు.

నిందితుల్లోని గంపి మహేష్, రాజుకు తమ్ముడు కాగా, మరోనిందితుడు పల్లెపు కృష్ణ ప్రధాన నిందితురాలు జానకి తమ్ముడు. వీరందరు హైదరాబాద్ లో వివిధ ప్రాంతాల్లో పనిచేసేవారు. ప్రధాన నిందితురాలు జానకి వంటమనిషిగా పనిచేసే సమయంలో మరో నిందితురాలు ఎల్లమ్మ ఆలియాస్ భాగ్యమ్మతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయంతో తన పనులతోపాటు, తాను పెంచుకోనేందుకు గాను ఒక బాలుడుని తీసుకోని వస్తే పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తానని ఎల్లమ్మ ప్రధాన నిందితురాలు జానకికి ఆఫర్ చేసింది. డబ్బుమీద ఆశతో ఎక్కడి నుండైన ఒక బాలుడుని ఎత్తుక రావాలని జానకి మిగితా నిందితులైన రాజు, మహేష్, కృష్ణలతో సెర్చింగ్ మొదలు పెట్టారు. దీనితో నిందితులు ముగ్గురు ఒక ఆటోలో ఈనెల పదవ తేదిన వరంగల్ నగరానికి చేరుకోని పదుకోండవ తేది తెల్లవారు జామున జెమిని టాకీస్ ప్రాంతంలోని మెయిన్ రోడ్డు ప్రక్కన తల్లి పొత్తిళ్ల వద్ద నిద్రిస్తున్న రెండు సంవత్సరాల బాలుడు డానియల్ ను నిందితులు కిడ్నాప్ చేశారు.

ఆవహరించిన బాలుడిని ఆటోలో హైదరాబాదు తీసుకొని పోయి, ప్రధాన నిందితురాలు జానకికి బాలుడిని అప్పగించారు. ఎల్లమ్మతో కుదిరిన ఒప్పందం ప్రకారం నిందితురాలు జానకీ హిమత్ నగర్ లో నివాసం ఉంటున్న ఎల్లమ్మకు లక్ష రూపాయలు ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకోని బాలుడుని అందజేసింది. బాలుడుని తీసుకున్న ఎల్లమ్మ తన మరిది అయిన మరో నిందితుడు జంగయ్యకు అందజేసింది. బాబు తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో అప్రమత్తమైన మట్వాడా పోలీసులు సెంట్రల్ జోన్ డిసిపి పుష్పా రెడ్డి పర్యవేక్షణలో వరంగల్ ఎసిపి గిరికుమార్ అధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు ప్రారంభించారు. సంఘటన జరిగిన ప్రదేశంతో పాటు ఇతర ప్రాంతాల్లోని సిసి కెమెరాల్లోని దృశ్యాల అధారం తో ప్రస్తుతం పోలీసులకు అందుబాటులో వున్న టెక్నాలజీ వినియోగించుకోని నిందితులను గుర్తించారు. పోలీసులు హైదరాబాద్లో బేగంపేటలోని నలుగు నిందితులతో పాటు వారి ఇచ్చిన సమాచారంతో హిమయత్ నగర్ లో ఎల్లమ్మను అరెస్టు చేసి విచారించారు. ఎల్లమ్మ ఇచ్చిన సమాచారం మేరకు రంగారెడ్డి జిల్లా, కందుకూరు మండలం మీర్ ఖాన్ పేటలో నివాసం వుంటున్న జంగయ్యను అరెస్టు చేయడంతో అపరహణకు గురైన బాలుడిని పోలీసులకు అప్పగించాడు. ఈ సంఘటనలో నిందితులు అపహరణకు వినియోగించిన ఆటో పాటు, సెల్ ఫోన్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అపహరణకు గురైన బాలుడుని పోలీసులు క్షేమంగా తీసుకోచ్చి శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి బాలుడిని, డేనియల్ తల్లికి  అప్పగించారు. బాలుడిని సేఫ్ గా తీసుకొచ్చి,అప్పగించిన పోలీసులకు తల్లి ఐశ్వర్య  ప్రత్యేక ధన్యవాధాలు తెలియ జేశారు. ఈ సంఘటనలో బాలుడున్ని క్షేమంగా తీసుకరావడంలో శ్రమించిన ఎసిపి గిరికుమార్, ఇన్స్పెక్టర్ గణేష్, ఎస్.ఐ అశోక్, ఆసిస్టేంట్ ఆనాలటికల్ ఆఫీసర్ సల్మాన్ పాషా, కానిస్టేబుల్ విజయ్, రాజేందర్ హోమ్ గార్డ్ దీపలను పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి అభినందించడంతో పాటు నగదు రివార్డులను అంద జేశారు.

- Advertisement -

ఆంధ్రప్రభ కథనం తర్వాతే కదిలిన పోలీసులు :  ఈ నెల 23 న ఆంధ్ర ప్రభ దిన పత్రికలో  వీడని కిడ్నాప్ మిస్టరీ న్యూస్ హెడ్ లైన్ తో ప్రచురితమైంది. 12 రోజులైనా పట్టించుకోని పోలీసులు అంటూ సవివరంగా వార్తా కథనం పబ్లిష్ అయ్యింది. ఆర్ధిక , అంగ బలం , రాజకీయ పలుకు బడి లేకపోతే, పట్టించుకోరా అంటూ పత్రికలో ప్రచురితమైన రోజే ప్రత్యేక పోలీస్ బలగాలు కిడ్నాప్ ముఠా ను ట్రెస్ చేశారు. ఆంధ్ర ప్రభ దిన పత్రికలో ప్రచురితమైన రోజే పోలీస్ ఉన్నతాధికారులు మట్టేవాడ పోలీసులకు క్లాస్ ఇచ్చారు. ఆ తర్వాతే పోలీసు బృందాలు కిడ్నాప్ మిస్టరీని చేజేజించేందుకు నడుం బిగించారు.

ఇది కూడా చదవండి: అందుకే కొత్త పార్టీలు: తెలంగాణ రాజకీయాలపై ఏపీ మంత్రి ఆసక్తికర వ్యాఖ్య

Advertisement

తాజా వార్తలు

Advertisement