Thursday, April 18, 2024

రేపు గ్రామ గ్రామాన నిరసన తెల్పాలి : స‌బితా ఇంద్రారెడ్డి

రాష్ట్ర రైతాంగ స‌మ‌స్య‌ల‌ను పట్టించుకోని కేంద్ర ప్రభుత్వ వైఖరి కి నిరసనగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ పిలుపు మేరకు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం చేతులేత్తిసిన నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నిర‌స‌న‌లు చేప‌ట్టాలని, కేంద్ర వైఖ‌రిని నిల‌దీస్తూ, రైతులకు అండగా నిలబడాలని పార్టీ శ్రేణులను మంత్రి కోరారు. కార్య‌క్ర‌మాల్లో భాగంగా బీజేపీ, కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ‌ల‌ను ద‌గ్దం చేయాలన్నారు.

యాసంగిలో పండే పంటను కొనమని కేంద్రం పార్లమెంట్ సాక్షిగా ప్రకటించిన నేపథ్యంలో, టిఆర్ఎస్ రైతుల పక్షాన ఉంటూ పోరాటం చేస్తుందన్నారు. జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ లు, జడ్పీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచ్, ఎంపీటీసీలు, మునిసిపల్ మేయర్లు, కార్పొరేటర్లు, మునిసిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలక వర్గాలు, రైతు బంధు సమితీలు, సొసైటీ పాలక వర్గాలు, గ్రామ స్థాయి నుండి పార్టీ అధ్యక్షులు, కార్యవర్గాలు, అనుబంధ కమిటీల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement