Friday, April 19, 2024

మట్టి తోడుతున్న యంత్రాలు.. అడ్డుకున్న గ్రామస్తులు

వరంగల్ జిల్లా నర్సంపేట రూరల్ మండలంలో మట్టి మాఫియాకు రెవెన్యూ అధికారులు అండదండలు మెండుగా ఉన్నాయా ? చెరువులో ఉపాధి హామీ పథకంలో భాగంగా తీయాల్సిన మట్టిని యంత్రాలతో తీసుకోవచ్చా ? అంటే అవును అంటున్నారు కొంత మంది రెవెన్యూ అధికారులు. ఉపాధి హామీ పథకాన్ని జోరుగా నడిపి కూలీలకు,ట్రాక్టర్ యజమానులకు,కార్యదర్శులకు కొంత మేర పనిని కల్పించాల్సిన అధికారులు.. అది మరచి యంత్రాలతో మట్టిని తరలించేదుకు సహాయం చేయడం ఏంటని లక్నేపల్లీ గ్రామ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో మట్టిని తీసి ట్రాక్టర్ల ద్వారా రైతుల పొలాల్లో పోసుకుంటే కొంత మేర రైతుకు ఆర్థికంగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. లక్నేపల్లి గ్రామ శివారులో ఉన్న ఊరచేరువులో ఉపాధి హామీ పనుల్లో చేయాల్సిన పనిని,యంత్రాలతో చేయిస్తున్నారు. దీంతో పనులు కొంతమంది గ్రామస్తులు అడ్డుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement