Thursday, April 25, 2024

TS Formation day – పండుగలా దశాబ్ది వేడుకలు – జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి

వికారాబాద్ మే 29 (ప్రభ న్యూస్) రైతు దినోత్సవం, ఊరురా చెరువుల పండుగ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలనీ వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర దశాబ్ది వేడుకల నిర్వహణపై సీఎస్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పాల్గొన్నారు. పండుగ వాతావరణంలో వైభవోపేతంగా రాష్ట్ర దశాబ్ది వేడుకలను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులతో కలిసి రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ లతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, జిల్లా అడిషనల్ ఎస్పి మురళీధర్, జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ నారాయన్ అమిత్, జడ్పీ సి ఈ ఓ జానకి రెడ్డిలతో కలిసి ఈ వీడియో సమావేశంలో పాల్గొన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ, జూన్ 2 న ఉదయం 9:00 గంటలకు పతాకావిష్కరణ కార్యక్రమ వేడుకలను ఘనంగా నిర్వహించెందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని తెలిపారు. జిల్లాలో అన్ని శాఖల ద్వారా చేపట్టిన ప్రగతి వివరించేలా ప్రసంగంతో పాటు స్టాల్స్ ఏర్పాటు చేయాలని అన్నారు. అన్ని శాఖలు ప్రతి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. గత తొమ్మిది సంవత్సరాలుగా జిల్లాలో జరిగిన అభివృద్ధిపై శాఖల వారిగా ప్రొఫైల్స్ తయారు చేయాలని సూచించారు. శతాబ్ది ఉత్సవాలు పూర్తయ్యే వరకు ఎవరికి కూడా సెలవులు మంజూరు చేయబడవని కలెక్టర్ తెలియజేశారు. గ్రామస్థాయిలో కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలన్నారు. జూన్ 2 నుండి 22 వరకు జరిగే దశబ్ది ఉత్సవాలలో ప్రతి శాఖ సహకారంతో కార్యక్రమాలను విజయవంతం చేసే విధంగా ముందుకు సాగాలని సూచించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్లు, మండల స్థాయి స్పెషల్ ఆఫీసర్లు, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement