Thursday, March 28, 2024

వెంక‌ట్రామిరెడ్డి పెద్ద అవినీతి ప‌రుడు…టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థి జ‌గ్గారెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

వెంక‌ట్రామిరెడ్డి పెద్ద అవినీతి ప‌రుడ‌ని, వెంకట్రామిరెడ్డి జాయింట్ కలెక్టర్ గా, జిల్లా కలెక్టర్ గా మల్లన్న సాగర్, కొకపేట, కొల్లూరు, జహీరాబాద్ భూముల పేరు మీద దండిగా దోపిడీ చేసిండని జ‌గ్గారెడ్డి అన్నారు. మెద‌క్ లో జ‌గ్గారెడ్డి మాట్లాడ‌తుఊ…. దోపిడీ చేసిన‌ ఆ పైసలు వెంకట్రామిరెడ్డి దగ్గర ఉన్నాయి.. కనుకే ఎమ్మెల్సీ ఇచ్చారన్నారు. ఇప్పుడు మెదక్ జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థికి ఇంచార్జిగా ఇచ్చారు. వెంకట్రామిరెడ్డి ఏమి పాలు అమ్మి, కష్టపడి కూలి చేసి డబ్బులు సంపాదించలేదన్నారు. అవి మన మెదక్ జిల్లా డబ్బులే.. అక్కడ తీసుకోండి ఇక్కడ ఓటు వేయండి.. అని అన్నారు. భవిష్యత్తులో వెంకట్రామిరెడ్డి సంగతి చూస్తామ‌ని జ‌గ్గారెడ్డి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement