Thursday, January 16, 2025

అసెంబ్లీ ముందు వేములవాడ నియోజకవర్గ యువత ఆందోళన

తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. తమ నియోజకవర్గ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కనిపించడం లేదంటూ వేములవాడ నియోజకవర్గానికి చెందిన కొంత మంది యువకులు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. తమ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కనిపించడం లేదంటూ ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. దీంతో అక్కడున్న పోలీసులు వారిని అరెస్ట్ చేసి గోశామహల్ పీఎస్ కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement