Wednesday, December 4, 2024

TG: సీఎం రేవంత్ కు వేములవాడ అర్చకుల ఆశీర్వాదం..

రూ.50 కోట్లు కేటాయించినందుకు కృతజ్ఞతలు


తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ అర్చక బృందం వేద ఆశీర్వచనం అందజేశారు. శుక్రవారం హైదరాబాదులోని సచివాలయంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆశీర్వచనం అందించి రాజన్న ప్రసాదం అందజేశారు.

వేములవాడ ఆలయ విస్తరణ కోసం 50 కోట్ల రూపాయలు కేటాయించినందుకు ఎమ్మెల్యేతో పాటు ఆలయ ఈవో వినోద్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆలయ విస్తరణ కోసం నమూనాలకు శృంగేరి పీఠం అనుమతి తీసుకోవాల్సి ఉందని ముఖ్యమంత్రికి తెలియజేశారు. వెంటనే శృంగేరి పీఠం అనుమతి తీసుకొని విస్తరణ పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.

- Advertisement -

ముఖ్యమంత్రిని స్థపతి వల్లినాయగం, ఈఈ రాజేష్, డీఈఈ రఘునందన్, ఆలయ ప్రధాన అర్చకులు ఉమేష్ శర్మ తో పాటు పలువురు కలిశారు. ఆలయ విస్తరణకు సంబంధించిన డిజైన్స్, నమూనాకు శృంగేరి పీఠం అనుమతి తీసుకోవాల్సి ఉందని ఆలయ అర్చకులు సీఎంకు తెలిపారు. వెంటనే వెళ్లి శృంగేరి పీఠం అనుమతి తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement