Friday, April 19, 2024

సూపర్‌ స్ప్రెడర్లకు కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌..

తెలంగాణలో సూపర్‌ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్‌ వేగవంతంగా కొనసాగుతున్నది. కరోనా కట్టడిలో భాగంగా నిత్యం వందల మందిని కలిసే అవకాశమున్నవారిని ప్రభుత్వం సూపర్ స్ప్రెడర్లుగా గుర్తించి వీరందరికీ టీకాలు వేస్తున్న విషయం తెలిసిందే. పౌరసరఫరాల శాఖ సిబ్బంది, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, వీధి వ్యాపారులు, జర్నలిస్టులు, వివిధ దుకాణాల్లో పనిచేసే వారిని సర్కార్‌ సూపర్ స్ప్రెడర్ల కేటగిరీలో చేర్చింది.

ఇందులో భాగంగా రేపు హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లోని ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లకు రవాణాశాఖ ఆధ్వర్యంలో వ్యాక్సిన్‌ పంపిణీ చేయనున్నారు. ఇందుకు కోసం జీహెచ్‌ఎంసీ పరిధిలో 10 టీకా పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వ్యాక్సిన్‌ వేయించుకోవాలనుకునే వారు టీకా కేంద్రాలకు ఆధార్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, వాహనం ఆర్‌సీ వెంట తెచ్చుకోవాలని రవాణాశాఖ అధికారులు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement