Wednesday, September 20, 2023

శ్రీ తుల్జా భవాని శక్తిపీట్ ఆలయంలో ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్తా ప్రత్యేక పూజలు

హైద‌రాబాద్: మహారాష్ట్ర రాష్ట్రం, తుల్జాపూర్ లోని శ్రీ తుల్జా భవాని శక్తిపీట్ ఆలయంలో అమ్మవారిని తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ పూర్వ చైర్మన్, ఐవీఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్తా-స్వప్న దంపతులు సకుటుంబ సమేతంగా.. దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా.. ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ.. శ్రీ తుల్జా భవాని శక్తిపీట్ ఆలయంను త‌మ కుటుంబంతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి ఆశీస్సులు పొందడం జరిగిందన్నారు. త‌మ కుటుంబాన్ని చల్లగా చూడాలని, అమ్మవారి కృప, దీవెనలు ప్రజలు అందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో బంగారు తెలంగాణ కోసం బాటలు వేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వంద సంవత్సరాలు జీవించాలని కోరుకున్న‌ట్లు తెలిపారు.

- Advertisement -
   

అలాగే దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు అంతా సుఖ సంతోషాలతో ఉండాలని, రైతులు అంతా పాడి పంటలతో విలసిల్లాలని, ప్రజలందరూ ఆనందంగా వుండాలని కోరుకున్నట్లు తెలిపారు. మహారాష్ట్రతో పాటు దేశవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ పార్టీ బాగుండాలని, మన తెలంగాణలో మూడవ సారి కూడా అధికారం చేపట్టి, 95 నుండి 100 సీట్లతో భారీ మెజారిటీతో గెలిచి, హ్యాట్రిక్ సాదించాలన్నారు. తెలంగాణలో అన్ని వర్గాలకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సమాన హక్కులు కల్పిస్తుంద‌న్నారు. అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తుందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతుబంధు, దళితబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, కేసీఆర్‌ కిట్‌, బీసీలు, ఎస్సీలు, ఎస్టీల కోసం ఓబీసీ ల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అన్ని వర్గాలకు సమాన న్యాయం చేస్తున్నార‌న్నారు. దేశ ప్రజలు బీఆర్‌ఎస్‌కు సంపూర్ణ మద్దతు ఇచ్చి ఇలాంటి పథకాలను దేశంలో ఉన్న 140 కోట్ల ప్రజలకు అమలు జరిగేలా చూడాలని కోరారు. దేశంలో రైతుల, పేదలు, బీదల బాధలు తెలిసిన ఒకే ఒక నాయకుడు తెలంగాణ సీఎం కేసీఆర్ అని, తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తు వంటి పథకాలు దేశంలోనూ అమలు చేయాలని తెలంగాణ మాడల్‌ దేశవ్యాప్తం కావాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement