Wednesday, May 25, 2022

FLASH: బొగ్గుల వాగులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని ఎడ్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని బొగ్గుల వాగు ప్రాజెక్టులో గురువారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. రోజులా ప్రాజెక్టులో చేపలు పట్టేందుకు వెళ్ళన జాలరులు గురువారం ఉదయం వెళ్ళే సరికి శవం కనబడడంతో కొయ్యూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయడంతో చేతులకు తలకు బండలతో కట్టి ఉండడంతో హత్య..? ఆత్మ హత్య? అనే కోణంలో విచారణ చేస్తున్నారు. మృతదేహం కూల్లిపోయిన స్థితిలో ఉంది. దీంతో మృతుడిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ సత్యనారాయణ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement