Thursday, April 25, 2024

హుజురాబాద్ లోనూ దుబ్బాక ఫలితమే!

హుజురాబాద్ ఉపఎన్నిక ప్రధాన పార్టీల నేతలను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గెలుపు తమదంటే.. తమదంటూ ధీమాతో ఉన్నారు. ఈ విషయంలో బీజేపీ గట్టి విశ్వాసంతో ఉంది. ఆపార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ బరిలో ఉన్నారు. హుజురాబాద్ నుంచి ఆరు సార్లు గెలిచిన ఈటలకు ఈసారి కూడా ప్రజలు పట్టం కడుతారని కాషాయ నేతలు అంటున్నారు. గతంలో దుబ్బాకలో వచ్చిన ఫలితామే హుజురాబాద్ లోనూ పునరావృతం అవుతుందని అంటున్నారు.

తెలంగాణలో నియంత పాలన కొనసాగుతుందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి అడ్డుగా ఉన్న కేసీఆర్‌ కుటుంబ పాలనకు రోజులు దగ్గరపడ్డాయన్నారు. హుజురాబాద్‌లోనూ దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాలే వస్తాయని జోస్యం చెప్పారు. గ్రామస్థాయి వరకు కేంద్రం చేసిన అభివృద్ధి పనులతో ముందుకు వెళ్తామని చెప్పారు.

మరోవైపు బీజేపీ గుర్తుతో తొలిసారి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు. ప్రజల్లో తనపై సానుభూతి ఉందని ఈటల నమ్మకంతో ఉన్నారు. కాగా, అక్టోబర్ 30న హుజురాబాద్ ఉపఎన్నిక జరగనుండగా.. నవంబర్ 2న ఫలితాలు వెల్లడి కానున్నాయి.

ఇది కూడా చదవండి: హుజురాబాద్ లో కేసీఆర్ రోడ్ షో.. బహిరంగ సభ రద్దయినట్టే!

Advertisement

తాజా వార్తలు

Advertisement