Tuesday, March 26, 2024

శుభకృత్ శుభాలు తేవాలే: మున్సిపల్ చైర్ పర్సన్

శుభకృత్ నామ సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో శుభాలు తేవాలని పెద్దపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమతప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని అమర్ చంద్ కళ్యాణమండపంలో పెద్దపల్లి మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వేద పండితులు నిర్వహించిన పంచాంగ శ్రవణం లో పాల్గొన్నారు. అనంతరం ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలందరూ కొత్త సంవత్సరంలో సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. రాబోయే రోజుల్లో పెద్ద పెళ్లి పట్టణ అభివృద్ధికి మరింత కృషి చేస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement