Tuesday, January 18, 2022

రెండు వాహనాలు ఢీ : ముగ్గురికి తీవ్ర‌గాయాలు

నేరడిగొండ మండలంలోని వాంకిడి గ్రామ సమీపంలోని రహదారిపై ఘాట్ మూల మలుపు వద్ద ఆదివారం రాత్రి సమయంలో రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ముగ్గరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై గుంపుల విజయ్ తెలిపిన వివరాల ప్రకారం… మావల మండల కేంద్ర వాసులు టాటా ఎస్ వాహనం తీసుకొని ఆదివారం సారంగపూర్ మండలం అడేల్లి పోచమ్మ దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో గౌలిగూడ గ్రామ సమీపంలో ఘాట్ మూల మలువు వద్ద ఎదురుగా వస్తున్న కొరటికల్ గ్రామానికి చెందిన సఫారీ వాహనం ఢీ కొనడంతో టాటా ఎస్ లో ప్రయాణిస్తున్న 11మందిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మిగతా వారు క్షేమంగా బయట పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థ‌లానికి చేరుకొని క్షతగాత్రులను వైద్య చికిత్స నిమిత్తం అంబులెన్స్ ద్వారా నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. విచారణ అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News