Sunday, December 5, 2021

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి

ఎల్బీనగర్, (ప్రభ న్యూస్) : బోర్వెల్ వాహనం డ్రైవర్ అతివేగం నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతిచెందగా మరో విద్యార్థి తీవ్ర గాయాలయ్యాయి. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సాగర్ రోడ్డు జాతీయ రహదారి పక్కన సిరిపురం కాలనీ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు బంధువులు తెలిపిన వివరాల హబ్సిగూడ కు చెందిన రోహిత్ రెడ్డి (20) జడ్చర్లకు చెందిన విశాల్ (20) జడ్చర్లకు చెందిన గౌతమ్ రెడ్డి (20) ముగ్గురు స్నేహితులు ఇబ్రహీంపట్నం మంగళపల్లి సీవీఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో సిఎస్ సి ఫైనల్ ఇయర్ చదువుతున్నారు.

కళాశాలకు వెళ్లి బి.యన్.రెడ్డి నగర్ వెంకటేశ్వర్ కాలనీలో నివాసముంటున్న రోహిత్ రెడ్డి రూమ్ కు తిరిగి వస్తుండగా సిరిపురం కాలనీ రోడ్డులో బోర్వెల్ లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో టీఎస్ 12 ఈఎన్ 7299 యాక్టివా బైక్ టీఎస్08 జి ఓ 3766పై ముగ్గురు వెళ్తుండగా వెనుక నుండి ఢీకొట్ట‌డంతో అదుపుతప్పి లారీ చక్రాల కింద పడ్డారు. రోహిత్ రెడ్డి, విశాల్ ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. గౌతమ్ రెడ్డికి తీవ్రగాయాల‌య్యాయి. అతను వెంటనే పక్కనే ఉన్న బృంగి ప్రవేటు ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్నపోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వనస్థలిపురం పోలీసులు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News