Thursday, April 25, 2024

బస్టాండ్‌లో సౌకర్యాల ఎలా ఉన్నాయి? ప్రయాణికులతో ముచ్చటించిన ఎండీ సజ్జనార్

తెలంగాణ ఆర్టీసీని త్వరలోనే లాభాల బాటపట్టిస్తామని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. ఇందుకోసం పట్టించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి నల్లగొండకు ప్రయాణికులతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. నల్లగొండ డిపో, బస్టాండ్‌ను పరిశీలించారు. బస్టాండ్‌లో సౌకర్యాలపై ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్గో సేవలు బాగున్నాయని, దానిద్వారా సంస్థకు ఆదాయం సమకూరుతున్నదని తెలిపారు. సురక్షిత ప్రయాణం కోసం ప్రజలు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేయాలని కోరారు. వివాహలు, విహార యాత్రలకు, రైతుల ధాన్యం తరలింపునకు ఆర్టీసీ సేవలు ఉపయోగించుకోవాలని కోరారు. అన్ని బస్టాండ్లలో ప్రయాణికుల భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు చేస్తామన్నామని వెల్లడించారు. బస్టాండ్లలో ఎమ్మార్పీ ధరలకే వస్తువులను అమ్మాలని, ఒక్క రూపాయి కూడా అదనంగా తీసుకోవద్దని సజ్జనార్ హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: పార్టీలో మార్పులు చేయాల్సిందే.. టీ. కాంగ్రెస్‌కు మాజీ ఎమ్మెల్సీ అల్టీమేటం!

Advertisement

తాజా వార్తలు

Advertisement