Thursday, April 25, 2024

TS: రెండో విడత గొర్రెల పంపిణీ.. ఎప్పటినుంచో తెలుసా

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ: ఈనెల 24 నుంచి పూరి ్తస్థాయిలో పెరిగిన వాటాధనాన్ని చెల్లించిన లబ్ధి దారు లకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేయనున్నట్లు పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ చెప్పారు. శుక్రవారం తన కార్యాలయంలో పశు సంవ ర్ధకశాఖ కార్యదర్శి అనితా రాజేం ద్ర, మత్స్యశాఖ కమి షనర్‌ లచ్చిరాం భూక్య, షిీప్‌ ఫెడరేషన్‌ ఎండీ రాం చం దర్‌లతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిం చారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం లో పెరిగిన గొర్రెల యూనిట్‌ ధరకు అనుగుణంగా 2,797 మంది లబ్ధిదారులు గతంలో చెల్లించిన వాటా కు అద నపు నిధులు చెల్లించారని, వారికి ఈనెల 24న నుండి గొర్రెల యూనిట్ల పంపిణీకి అవసరమైన ఏర్పా ట్లు చే యాలని అధికారులను ఆదేశించారు. డీడీ చెల్లిం చిన మిగిలిన లబ్ధిదారులు కూడా అద నపు వాటా ధనాన్ని చెల్లించి గొర్రెల యూనిట్లను పొందాలని సూచించారు.

- Advertisement -

పంపిణీని వేగవంతం చేయాలి
మత్స్యకారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప, రొయ్య పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని వేగ వంతం చేసి, నవంబర్‌ 15 నాటికి వందశాతం లక్ష్యా న్ని సాధించాలని మంత్రి మత్స్య శాఖ అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు, చెరువులు, రిజర్వాయర్ల నుండి నీటి ఓవర్‌ఫ్లో కారణంగా చేప, రొయ్య పిల్లల విడుదల కార్యక్రమం కొంత నెమ్మదిగా జరుగు తుందని తెలి పారు.

ఇప్పటి వరకు 13,043 నీటి వన రుల్లో 32.26 కోట్ల చేప పిల్లలను ఐదు రిజర్వా యర్లలో 12.60 లక్షల రొయ్య పల్లలను విడుదల చేసినట్లు వివ రించారు. ప్రభు త్వ నిబంధ నలకు అనుగుణంగా ఉన్న చేప, రొయ్య పిల్లలను మాత్రమే విడుదల చేయాలని, విడుదల ప్రక్రియను తప్ప కుండా వీడియో, ఫోటోగ్రఫీ చేయాలని ఆదేశించారు. ఎవరైనా నిబంధ నలకు వి రుద్ధంగా వ్యవహరించినట్లు తమ దృష్టి కి వస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు.కొన్ని జిల్లాల్లో చేప పిల్లల విడుదల కార్యక్రమం అనుకు న్నంత వేగం గా జరగడం లేదని, వాటికి కారణాలను సమీక్షించి నిర్దేశించిన గడువులోగా పూర్తి స్థాయిలో పంపిణీ చేయాలని ఆదేశిం చారు.

మత్స్య ఫెడరేషన్‌ ద్వారా కొర్ర మేను చేప పిల్లలను ఉత్పత్తి చేసేందుకు తీసు కోవాల్సిన చర్యలపై అధ్య యనం చేసి నివేదిక అందిం చాలని మత్స్యశాఖ కమిషనర్‌ను మంత్రి ఆదేశిం చారు. అదే విధంగా వచ్చే సంవత్సరం ఉచి తంగా పంపిణీ చేయనున్న చేప పిల్లలను మన రాష్ట్రంలోనే ఉత్పత్తి చేసేందు కు అవ సరమైన చర్యలను ఇప్పటి నుండే చేపట్టాలని చెప్పారు. త్వరలో ఇరిగేషన్‌ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి వారి ఆధీనంలో ఉన్న జల వనరుల వద్ద మత్స్యశాఖ కార్య క్రమాలను నిర్వహిం చడానికి రూ పొందించిన అంశాలపై చర్చించి తగు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి తలసాని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement