Friday, September 22, 2023

TS PGECET: తెలంగాణ పీజీఈసెట్‌ ఫలితాలు విడుద‌ల‌

హైదరాబాద్‌: తెలంగాణలోని ఉన్నత విద్యాసంస్థల్లో చేరేందుకు నిర్వహించిన పీజీ ఇంజినీరింగ్‌ సెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఎంటెక్‌, ఎం.ఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం పీజీఈసెట్‌ను జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ నిర్వహించింది. ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ లింబాద్రి, జేఎన్‌టీయూహెచ్‌ వీసీ ఆచార్య కట్టా నర్సింహారెడ్డి విడుదల చేశారు. మే 29 నుంచి జూన్‌ 1వ తేదీ వరకూ 19 సబ్జెక్టుల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 14,800 మందికి పైగా విద్యార్థులు ఎగ్జామ్స్ రాశారు. ర్యాంకుల వివ‌రాలు https://pgecet.tsche.ac.in/ వెబ్ లో చూడ‌వ‌చ్చు

Advertisement

తాజా వార్తలు

Advertisement