Thursday, April 25, 2024

TS: కరోనా భయం వీడి.. హాస్టల్ కు క్యూకడుతున్న స్టూడెంట్స్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కరోనా కారణంగా తాత్కాలికంగా మూతబడిన ప్రభుత్వ విద్యార్థి వసతి గృహాలు మళ్లీ తెరుచుకోవడంతో హాస్టళ్లకు వచ్చే విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలకు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ హాస్టళ్లలకు డిమాండ్‌ పెరుగుతోంది. దీంతో రెసిడెన్షియల్‌ స్కూళ్లలో చేరేవారి సంఖ్య పెరుగుతోంది. 2021-22 విద్యా సంవత్సరంలో కొత్తగా చేరే వారితో పాటు, పాత విద్యార్థులు కూడా తిరిగి హాస్టళ్లకు వస్తున్నారు. దీంతో పాఠశాల అనుబంధ హాస్టళ్లలో విద్యార్థుల హాజరుశాతం పెరుగుతున్నట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.

రాష్ట్రంలో మొత్తం విద్యా, వసతి ఒకేచోట ఉన్న 672 విద్యా సంస్థలు ఉంటే అందులో కేజీబీవీ (కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం) విద్యా సంస్థలు 475, యూఆర్‌ఎస్‌ (అర్బన్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌) 29, పాఠశాల అనుబంధ బాలికల హాస్టళ్లు 168 వరకు ఉన్నాయి. కేజీబీవీ విద్యా సంస్థల్లో 6వ తరగతి నుంచి పదో తరగతి వరకు చదివే పిల్లలకు విద్యా, వసతి కల్పిస్తారు. అలాగే బడిబయట ఉండే పిల్లలను గుర్తించి 3 నుంచి 10వ తరగతి చదివే వారికి బోర్డింగ్‌ వసతిని యూఆర్‌ఎస్‌లో కల్పిస్తారు. అదే విధంగా పాఠశాలల అనుబంధంగా ఉన్న మరికొన్ని గర్ల్స్‌ హాస్టళ్ల లోనూ బాలికలకు వసతి కల్పిస్తారు.

- Advertisement -

రాష్ట్రంలో ప్రత్యక్ష తరగతి బోధన సెప్టెంబర్‌ 1 నుంచే ప్రారంభమైనా.. ఈ విద్యా సంస్థల్లో చదువు పిస్తూ హాస్టళ్లలో ఉంచేందుకు విద్యార్థుల తల్లిదం డ్రులు అంతగా ఇష్టపడ లేదు. హాస్టళ్లలో ఉంటూ చదు వుకుంటే తమ పిల్లలు ఎక్కడ కరోనా బారినపడు తారోననే భయం వారికి ఉండేంది. దీంతో చాలా మంది హాస్టళ్లకు పంపించేందుకు విముఖత చూపిం చారు. అయితే రాష్ట్రంలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరు కోవడంతో విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రా యాల్లో మార్పు వస్తోంది. తమ పిల్లలను హాస్టళ్లలో ఉంచి చదివించేందుకు ఇష్టపడుతున్నారు. మరోవైపు గురుకులాలను తెరిచేందు కు హైకోర్టు కూడా అనుమ తినిచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రం లోని పాఠశాల విద్యాశాఖ పరిధిలోని 672 విద్యా సంస్థల్లోని హాస్టళ్లూ అన్నిటికి అన్నీ తెరుచుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు.

వీటిలో క్రమంగా విద్యార్థుల హాజరు శాతం పెరుగుతోందని పేర్కొన్నారు. కేజీబీవీలో 1,10,666 విద్యార్థులకు గానూ 41,280 మంది (37 శాతం) వచ్చారు. యూఆర్‌ఎస్‌ హాస్టళ్లో 1814 స్టూడెంట్లకు గానూ 539 (29.71 శాతం), గర్ల్‌ ్స హాస్టళ్లలో 15,295 మందికి 3438 మంది (22.48 శాతం) వచ్చినట్లు అక్టోబర్‌ 28 వరకు ఉన్న అధికారిక లెక్కలు తెలుపుతున్నాయి. మొత్తంగా 672 హాస్టళ్లలో 1,27,775 మందికిగానూ 45,257 (35.42 శాతం) మంది వచ్చారు. దీపావళి సెలవుల తర్వాత విద్యార్థుల హాజరు శాతం మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement