Saturday, April 20, 2024

TS: హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం

Karimnagar: హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ రాత్రి ఏడు గంటల వరకు కొనసాగుతుంది. 2,37,022 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. అధికార టీఆర్ ఎస్‌ తరఫున గెల్లు శ్రీనివాస్ యాదవ్, బిజెపి నుండి మాజీ మంత్రి ఈటల రాజేందర్, కాంగ్రెస్ పార్టీ నుండి బల్మూర్ వెంకట్ రావు బరిలో ఉన్నారు.

కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పోలింగ్ జరిగేలా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గంలో హుజురాబాద్, వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట, కమలాపూర్ మండలాల్లో 306 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు.

పోలింగ్ సరళిని కరీంనగర్ జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి కర్ణన్ పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయగా భద్రతా ఏర్పాట్లను కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ పరిశీలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement