Thursday, March 28, 2024

TS: ఇందూరులో దీపావళి సందడి.. కళ‌కళలాడుతున్న పలు షాపులు..

నిజామాబాద్ ,ప్రభ న్యూస్ : పురాణాల ప్రకారం దీపావళికి ముందు వచ్చే త్రయోదశిని ‘ధన్‌రాస్‌’ ‘ధన త్రయోదశి’ ‘చోటీ దివాళీ’ అని అంటారు. ధనత్రయోదశి అంటే సంపద, శ్రేయస్సు అని అర్థం. హిందూ పురాణాల్లో చాంద్రమానాన్ని అనుసరించి ఆశ్వ యుజ మాసంలోని శుక్లపక్ష త్రయోదశికి ‘ధనత్రయోదశి’ అనిపేరు కలదు. ఈ రోజు ప్రత్యేకంగా బంగారాన్ని కొనుగోలు చేస్తారు. బంగారం, వస్త్రాలను కొనుగోలు చేసి, సా యంత్రం దీపాలు వెలిగించి లక్ష్మీదేవికి స్వాగ తం పలుకుతారు. మహిళలు అందమైన రంగ వల్లికలు వేసి, భక్తి గీతాలు పాడుతూ, నైవేద్యం సమర్పించి, మంగళహారతి ఇస్తారు. ఇలా చే యడం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువుండి, సిరిసంపదలతో తులతూగుతారని నమ్మకం. ప్రతి ఒక్కరూ తమ తాహతకు తగినట్లు బంగా రం, వెండి, కొత్త బట్టలు, విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ధన త్రయోదశి నాడు ఏదైనా కొత్త వస్తువును కొనుగోలు చేస్తే శుభం జరుగుతుందని నమ్ముతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement