Saturday, April 20, 2024

TS: మోడల్‌ స్కూల్‌ విద్యార్థులకు బస్సు సౌకర్యం

రెంజల్‌, (ప్రభన్యూస్‌) : మండలంలోని తెలంగాణ మోడల్‌ స్కూల్‌ విద్యార్థులకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినట్లు మండల విద్యాధికారి గణేష్ రావు తెలిపారు. సోమవారం నిజామాబాద్‌ డిపో నుండి కందకూర్తి, తాడ్‌బిలోలి వైపు తెలంగాణ మోడల్‌ స్కూల్‌ విద్యార్థులకు ఉన్నటువంటి బస్సు సౌకర్యం సదుపాయాన్ని ఆర్టిసీ అధికారులు, ప్రజాప్రతినిధుల చొరువతో బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. ఉదయం, సాయంత్రం వేళలో విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా బస్సులను రవాణా చేయడం జరుగుతుందన్నారు. అనంతరం సర్పంచులు రమేష్‌ కుమార్‌, ఏకార్‌పాషా, నాయకులు సంతోష్‌, నర్సయ్య, కిషోర్‌, బాబు నాయక్‌, ఆర్టిసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement