Sunday, October 17, 2021

కార్గో సేవలతో పెగిగిన ఆర్టీసీ ఆదాయం: మంత్రి పువ్వాడ

నష్టాల్లో ఉన్న తెలంగాణ ఆర్టీసీని పరుగులు పెట్టిస్తామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్ స్పష్టం చేశారు. కార్గో, పార్శిల్ సేవల ద్వారా ఆర్టీసీ ఆదాయాన్ని మెరుగుపరుచునేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. శాస‌న‌స‌భ‌లో ప్రశ్నోత్త‌రాల సంద‌ర్భంగా ఆర్టీసీ కార్గో పార్శిల్ సేవ‌ల‌పై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి అజ‌య్ కుమార్ స‌మాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్టీసీ ప్ర‌వేశ‌పెట్టిన కార్గో పార్శిల్ సేవ‌ల ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 62.02 కోట్లు  ఆదాయం వచ్చిందని తెలిపారు. ఆర్టీసీ బలోపేతానికి ప్రజాప్రతినిధులంతా కృషి చేయాలని కోరారు.

కార్మికుల సమ్మె, కరోనా మహమ్మారి, లాక్​డౌన్ వల్ల టీఎస్ ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోయిందన్నారు. నష్టాల నుంచి గట్టెక్కించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పెరిగిన ఇంధన ధరలు ఆర్టీసీకి పెనుభారం అవుతున్నాయని చెప్పారు. కార్గో, పార్శిల్ సర్వీసులతో ఆర్టీసీని గాడిన పట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు మంత్రి వివరించారు. ప్ర‌స్తుతం కార్గో, పార్శిల్ సేవ‌లు 177 బ‌స్ స్టేష‌న్ల నుంచి ఆప‌రేట్ చేస్తున్నట్లు మంత్రి పువ్వాడ తెలిపారు.

ఇది కూడా చదవండి: కొత్త కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ.. మాజీ మంత్రి ఈటలకు కీలక పదవి

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News