Thursday, April 18, 2024

TS: 15 వేలు లంచం తీసుకుంటూ ప‌ట్టుబ‌డ్డ అధికారి.. ఎవ‌రంటే..

నిజామాబాద్‌ అర్బన్ (ప్రభన్యూస్‌) : నిజామాబాద్‌ వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం పరిపా లన అధికారి ఏసీబీకి చిక్కారు. డిప్యూటీ డీఎంహెచ్‌ వో డ్రైవర్‌ కం ఓనర్‌ వద్ద అద్దె కారు బిల్లు చెల్లించడానికి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరో దక శాఖకు చిక్కారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాల యం పరిపాలన అధికారి శోభినాయక (శోభన్‌ బాబు) రూ.15వేల లంచం తీసుకుంటుండగా నిజామాబాద్‌ ఏసీబీ డీఎస్పీ సతీష్‌ కుమార్‌ ఆధ్వర్యంలో అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌ గా పట్టుకున్నారు.

నిజామాబాద్‌ డిప్యూటీ డీఎంహెచ్‌వోగా పని చేస్తున్న డా.అంజనకు సంబం ధించిన ప్రైవేట్‌ అద్దె వాహన యజమాని అయిన సమీర్‌ హైమద్‌ కు ఆరు నెలల నుంచి కారుకు సంబంధించిన అద్దె డబ్బులు రావాల్సి ఉంది. వాటిని ఇవ్వడానికి ఏవో లంచం డిమాండ్‌ చేశారు. ప్రతి నెల రూ.3 వేల చొప్పున లంచం ఇస్తేనే బిల్లులు చెల్లిస్తానని డిమాండ్‌ చేశారు.

దాంతో ఆరు నెలలకు సంబంధించి రూ.20 వేల లంచం ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. గత కొంత కాలంగా డబ్బులు ఇవ్వనిదే బిల్లులు మంజూరు కాకపోవడంతో బాధితుడు సమీర్‌ హైమద్‌ గత నెల 31న ఏసీబీని ఆశ్రయించాడు. పక్కా ప్రణాళిక ప్రకారం సోమవారం డీఎంహెచ్‌ వో కార్యాలయంలోని ఏవో తన చాంబర్‌లో సమీర్‌ నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏవో కార్యాలయంలో రికార్డులను సీజ్‌ చేశారు. అనంతరం ఏవో కార్యాల యం ద్వారా జరిగిన వివిధ కార్యకలాపాలను పరిశీలిం చారు. అనంతరం ఒక టీం ఏవో శోభన్‌ కు సంబంధిం చిన ఇళ్ళు సీతారాంనగర్‌ కాలనీలో సోదాలు నిర్వహిం చారు. అనంతరం శోభి నాయక ను అదుపులోకి తీసు కుని కరీంనగర్‌ ఏసీబీ కోర్టులో హాజరుపర్చుతామని ఏసీబీ డీఎస్పీ సతీష్‌ కుమార్‌ తెలిపారు. డిసెంబర్‌ మాసంలో పదోన్నతులు వస్తున్న క్రమంలో సోమవారం శోభినాయక ఏసీబీకి చిక్కడం గమనార్హం. డీఎం హెచ్‌ వో శాఖలో అవినీతి ఇప్పటిది కాదు. ఉమ్మడి రాష్ట్రం లో నిజామాబాద్‌ డీఎంహెచ్‌ వోగా ఉన్న డా.రామ్మూర్తి వద్ద పని చేసే డ్రైవర్‌ గంగారాం వద్ద నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. తర్వాత కాలంలో ఆరోపణలతో విచారణలు జరిగాయి కానీ ఎక్కడ రెడ్‌ హ్యాండెడ్‌ గా దొరికిన దాఖలాలు లేవు.

Advertisement

తాజా వార్తలు

Advertisement