Thursday, April 18, 2024

టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ విడుదల

టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికకు సంబంధించిన  షెడ్యూల్‌ విడుదలైంది. ఆదివారం నుంచి ఈ నెల 22 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 23 ఉదయం 11 గంటలకు నామినేషన్లను పరిశీలించనున్నారు. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు తెలంగాణ భవన్ లో నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఎం శ్రీనివాస్ రెడ్డి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈనెల 25న హెచ్‌ఐసీసీలో జరిగే ప్లీనరీలో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుంది.  ఈ ప్లీన‌రీకి 13 వేల మందికి పైగా ప్ర‌తినిధులు హాజ‌ర‌వుతార‌ని పార్టీ ప్ర‌క‌టించింది.

ఇది కూడా చదవండి: బిగ్ బాస్ నుంచి లోబో ఔట్.. కానీ..

Advertisement

తాజా వార్తలు

Advertisement